మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులకు అస్వస్థత

 మధ్యాహ్న భోజనం వికటించి 40  మంది విద్యార్థులకు అస్వస్థత

రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓ చోట ఫుడ్​పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా నిజామాబాద్ జిల్లాలోని  నవీపెట్ మండల కేంద్రంలోని  బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. భోజనం చేసిన తరువాత విద్యార్ధులు వాంతులు చేసుకోవడంతో  వారిని వెంటనే  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు.  ఇందులో ఆరుగురు విద్యార్థులను అడ్మిట్ చేసుకొని మిగతా వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 

ఇటీవలి ఘటనలు

రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదిలోనే అనేకచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయి. వందలాది మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. మెదక్ జిల్లాలోని ఓ గురుకులంలో ఫుడ్​పాయిజనై 27 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. మహబూబ్​నగర్ జిల్లాలో12 మంది, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 8 మంది, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బల్లి పడ్డ కూర తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మానుకోటలో ఉన్న గురుకులాల్లో అన్నంలో బొద్దింకలు, పప్పులో వానపాములు వచ్చాయి. ఆ ఫుడ్​తిన్న 37 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సిద్దిపేట జిల్లా, ఆసిఫాబాద్, మెదక్, నిజామాబాద్ ఇలా ప్రతీ జిల్లాలో సరైన భోజనం పెట్టక విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.