సీఈసీకి 42 మంది మాజీ జడ్జీల మద్దతు..ఎస్‌‌‌‌ఐఆర్ చట్టబద్ధ ప్రక్రియేనని స్పష్టీకరణ

సీఈసీకి 42 మంది మాజీ జడ్జీల మద్దతు..ఎస్‌‌‌‌ఐఆర్ చట్టబద్ధ  ప్రక్రియేనని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌‌‌‌ఐఆర్) చట్టబద్ధమైన ప్రక్రియేనని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టుల మాజీ జడ్జీలు 42 మంది సీఈసీ జ్ఞానేశ్​కుమార్​కు మద్దతు తెలిపారు. న్యూఢిల్లీలో గురువారం విడుదల చేసిన బహిరంగ లేఖలో వారు వివరాలను వెల్లడించారు.  తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వమని, అయితే రాజ్యాంగ సంస్థలపై నిరంతర దాడులు జరుగుతున్నందున ‘మౌనం ఇకపై తటస్థ ఎంపిక కాదు’ కాబట్టి మాట్లాడాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఎస్‌‌‌‌ఐఆర్ ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. ఓటర్ల జాబితాలను సవరించే పూర్తి అధికారం ఎన్నికల చట్టం ఈసీకి కల్పిస్తోందని, మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇలాంటి సవరణలు పదేపదే జరిగాయని స్పష్టం చేశారు.