
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందడే కనిపిస్తోంది. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడిగా, నాయకుడిగా పేరుగాంచిన ఆ మహానీయుడి పేరిట ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 45 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్ని టాలీవుడ్ స్టార్ హీరో, ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడు.
ఇందులో బాగంగా.. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సదర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరపనుండగా, దానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించారు. ఇప్పటికే ఎన్టీఆర్ విగ్రహం తయారు కూడా పూర్తయింది. తరలింపుకు కూడా రంగం సిద్ధమైంది. 36 అడుగుల పొడవు వెడల్పు, వెయ్యి అడగుల విస్తీర్ణం ఉండే బేస్ మెంట్ పై ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. శ్రీకృష్ణుడి రూపంలోని ఈ ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి దాదాపు రూ.4 కోట్లు ఖర్చు చేసారు. మంత్రి పువ్వాడ, తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయశేఖర్, ఖమ్మం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, కొందరు ఇండస్ట్రియలిస్టులు ఈ విగ్రహ నిర్మాణంలో ఆర్థికంగా పాలుపంచుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ద్వారా ఖమ్మం పట్టణం పర్యాటకంగానూ ఆకర్షణీయంగా మారుతుందని భావిస్తున్నారు.
ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది