జడ్చర్లకు 450 మెట్రిక్ టన్నుల యూరియా

జడ్చర్లకు 450 మెట్రిక్ టన్నుల యూరియా

జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల రైల్వేస్టేషన్​కు మంగళవారం 450 మెట్రిక్​ టన్నుల యూరియా చేరింది. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి, కలెక్టర్​ విజయేందిర బోయి, అడిషనల్​కలెక్టర్​ సీతారామచంద్ర, డీఏవో వెంకటేశ్ పర్యవేక్షణలో యూరియాను అన్​లోడ్​ చేశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించేందుకు కుట్ర చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొందరు అధికారులు కూడా యూరియా అలాట్​మెంట్​లో  అక్రమాలకు పాల్పడుతున్నారని విచారణ జరిపించాలని కలెక్టర్​ను కోరారు. 

కమీషన్లు బయటపడుతాయనే బీఆర్ఎస్ ధర్నా

జడ్చర్ల టౌన్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమీషన్లు బయటపడుతాయనే బీఆర్​ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నిధులను పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌కు కాకుండా ఒక టీఎంసీ పెంచే పేరుతో తప్పుగా తరలించారన్నారు. గంగాపూర్ గ్రామంలో లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద నూతన షెడ్, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ వ్యవస్థను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి పథకాలను రూ.81 లక్షలతో చేపట్టిన విషయాలను వివరించారు. మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, ఏఎంసీ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి పాల్గొన్నారు.

యూరియా సరఫరాపై రైతుల ఆందోళన

పట్టణ కేంద్రంలోని ఆగ్రో సెంటర్ 2 వద్ద యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే స్పందించి మధ్యాహ్నం లోపే యూరియా రేక్ జడ్చర్ల కేంద్రానికి చేరుతుందని హామీ ఇచ్చారు. యూరియా సరఫరాలో అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  మధ్యాహ్నం, జడ్చర్ల కేంద్రానికి వచ్చిన యూరియా రేక్ ను కలెక్టర్ తో కలిసి పరిశీలించారు.