న్యూఢిల్లీ: రివర్ క్రూజ్ టూరిజంను అభివృద్ధి చేయడానికి రూ.45 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పెట్టుబడిలో 2047 నాటికి క్రూజ్ వెసెల్స్ కోసం రూ. 35వేల కోట్లు, క్రూజ్ టెర్మినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 10వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది. కోల్‌కతాలో జరిగిన తొలి ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యుడిసి) సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
షిప్పింగ్ ఓడరేవుల మంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పరిశ్రమల ప్రముఖులను కలిసి అంతర్గత జలమార్గాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వ్యూహరచన చేశారు. రివర్ క్రూయిజ్ టూరిజంను ఎనిమిది నుంచి 26 జలమార్గాలకు విస్తరిస్తారు. రాత్రి బసలతో కూడిన క్రూయిజ్ సర్క్యూట్‌లను 17 నుంచి 80కి పెంచుతారు.
