
పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 465 దరఖాస్తులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 117, పౌరసరఫరాల శాఖకు 45, విద్యుత్ శాఖకు 31, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 39, మైనారిటీ వెల్ఫేర్ కు 58, ఇతర శాఖలకు సంబంధించినవి 175 ఉన్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించారు.
విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో బిల్లు కలెక్టర్లుగా పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచలేదని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆర్టిజన్లుగా గుర్తించాలని ప్రజా భవన్ ఆవరణలో బైఠాయించారు.