Big Breaking : రైతుల ఆదాయంపైనా ఆదాయ పన్ను.. ఆర్థిక వేత్త ఏం చెబుతున్నారంటే..?

Big Breaking :  రైతుల ఆదాయంపైనా ఆదాయ పన్ను.. ఆర్థిక వేత్త ఏం చెబుతున్నారంటే..?

Income Tax: భారత రైతులు సబ్సిడీల మాటున ప్రభుత్వాల నుంచి సమర్థవంతంగా పన్నులు విధించబడుతున్నారని వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ గులాటి వెల్లడించారు. వినియోగదారుల సంక్షేమం ముసుగులో విధాన వక్రీకరణలు వ్యవసాయ ఆదాయాలను అణచివేస్తూనే ఉన్నాయని హెచ్చరించారు.

భారతదేశంలో రైతులపై ఎందుకు ప్రభుత్వం ఆదాయపు పన్ను విధించటం లేదనే ప్రశ్నకు ఇంటర్వ్యూలో ఆయన బదులిచ్చారు. తాను వ్యవసాయంతో సహా అన్ని ఆదాయ మార్గాలపై పన్ను వసూళ్లను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఏ మార్గం నుంచి ఎక్కువ ఆదాయం వచ్చినా దానిపై సరైన పద్ధతిలో సరైన శాతం మేర పన్ను విధించబడాలన్నారు. వ్యవసాయం విషయంలో కూడా అంతేనని ఆయన తన మద్దతు తెలిపారు. ఇయితే ఇక్కడ ఉన్న చిక్కు ఖర్చు, ఆదాయం అనే అంశాలను లెక్కించటంలోనే ఉందన్నారు. వాటిని అంచనా వేయటం చాలా కష్టతరమని చెప్పారు.

వాస్తవానికి దేశంలోని రైతులు సమర్థవంతంగా నికర పన్నుల పరిథిలోకి వస్తున్నారన్నారు. రైతులకు సబ్సిడీలు, ఉచిత కరెంట్, రాయితీలో ఎరువులు అందిస్తున్నప్పటికీ చివరికి వాటిని అమ్ముకోనివ్వకుండా ఎగుమతులపై ఆంక్షలు పెడుతున్నారని ఆర్థిక వేత్త చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో రైతులు పండిస్తున్న పంట విలువలో దాదాపు 14 శాతం విలువ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలకు పోతుందని అన్నారు. చైనా కూడా తన రైతులను కాపాడుకునేందుకు వారికి సబ్సిడీల రూపంలో దాదాపు 14-15 శాతం సపోర్ట్ అందిస్తోంది. 

చైనా, జపాన్ మాదిరిగా ఇండియాలో పరిస్థితులు లేవని. నికర ప్రాతిపదికన భారతీయ రైతులు పన్ను చెల్లిస్తున్నారన్నారు. ఇదే క్రమంలో దేశంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉత్పత్తుల ధరలను కావాలని తగ్గించే విధానాన్ని ఆర్థిక వేత్త తప్పుపట్టారు. మార్కె్ట్లో కేజీ రూ.42 ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను ఈ సంస్థ రూ.29కి అమ్ముతోందని.. దీంతో ధరలు అమాంతం పడిపోయి రైతులకు నష్టం జరుగుతోందని అన్నారు. మనం విదేశీ ఉత్పత్తుల డంపింగ్ ఆపేందుకు యాంటీ డంపింగ్ డ్యూటీలు పెడుతూ దేశంలోని ఎఫ్సీఐ వంటి సంస్థలు అదే పని చేయటాన్ని ప్రోత్సహించటం సరికాదన్నారు. 

వస్తువుల రేట్లు పెరుగుతున్నప్పుడు ఎగుమతులను నిషేధించటం వాటి రేట్లు పంట దిగుబడి ఎక్కువగా ఉండి రూపాయి రెండు రూపాయలకు పడిపోయినప్పుడు రైతులను రోడ్లపై వదిలేయటం సరైన పద్ధతి కాదని గులాటీ అన్నారు. 1960ల కాలం కోసం రూపొందించుకున్న విధానాలనే ప్రభుత్వాలు ఇప్పటికి రైతుల విషయంలో ఫాలో అవ్వటం సరైనది కాదని.. ఇప్పటికైనా కళ్లు తెరచి  ప్రభుత్వాలు విధాన మార్పులను వెళ్లాలన్నారు. 

ALSO READ : ట్యాక్స్ హంటింగ్..!! ఏపీలోని బజ్జీలు, బోండాలు, టిఫిన్ షాపుల్లోని UPI పేమెంట్స్‌పై GST ఆరా

ఒ వ్యక్తి రూ.30 లక్షలు పెట్టి కారు కొని నడిపే స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారి కోసం ధరలు తగ్గించి కేజీ ఉల్లి మార్కెట్ కంటే తక్కువకు అందించటం దేనికని ప్రశ్నించారు. వాస్తవానికి అది రైతులకు దక్కాల్సిన ఆదాయం అని, దానిని ప్రభుత్వాలు తమ చర్యలతో అడ్డుకుంటున్నాయని అన్నారు. నేటి కాలంలో చాలా మంది సంపన్నులతో పాటు ఉన్నత వృత్తుల్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు భూమిని కొంటూ వారి ఆదాయాన్ని వ్యవసాయం నుంచి వస్తున్నట్లు చూపిస్తూ పన్నులు తప్పించుకుంటున్నారని గులాటీ ఎత్తిచూపారు. తక్కువ రేటు కింద పన్ను కిందకు వ్యవసాయ అదాయాన్ని కూడా తీసుకురావటంలో తప్పేమీ లేదని అన్నారు. వ్యవసాయ ఆదాయం పన్ను రహితం అనే చట్టంలోని లొసుగులు కొందరు స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవటాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా అన్నారు. నల్లధనాన్ని వ్యవసాయ ఆదాయం అంటూ వైట్ చేసుకుంటున్న  పెద్దల పనిపట్టాలని అన్నారు.