తిన్న తరువాత 2 నిమిషాల నడక : గుండె జబ్బులకు బై బై, షుగర్ కు చెక్ !

తిన్న తరువాత 2 నిమిషాల నడక : గుండె జబ్బులకు బై బై, షుగర్ కు చెక్ !

రోజుకు కిలోమీటర్ల కొద్దీ నడవడం గురించి మీరు వినే ఉంటారు. కానీ కేవలం 2 నిమిషాల నడక మీకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. చాలా మంది మధ్యాహ్నం భోజనం తరువాత లేదా రాత్రి తిన్న తరువాత హాయిగా రిలాక్స్ అవుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్యాన్ని పిలిచి పలకరించినట్లే... అవును, భోజనం తర్వాత ప్రశాంతంగా కాసేపు నడవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి కొన్ని అనారోగ్య సమస్యలు రాకుండా సహాయపడుతుందని తెలుసా... 

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వర్క్ ఫ్రొం హోమ్ కల్చర్ వచ్చాక హడావిడి లైఫ్ స్టయిల్ కాస్త మారిపోయింది. దింతో ఇంట్లో భోజనం తర్వాత సోఫాలో పడుకోవడం, ఫోన్ చూస్తూ స్క్రోల్ చేయడం  లేదా ల్యాప్‌టాప్‌ పట్టుకొని  మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల నిశ్శబ్దంగా మన జీవక్రియ, రక్తంలో చక్కెర, గుండె ఆరోగ్యంతో చెలగాటమాడినట్లే... 

ALSO READ : నిజంగా సుకన్య సమృద్ధి యోజన మీ బిడ్డకు రూ.69 లక్షలు ఇవ్వదు..! ఇవే అసలు లెక్కలు!

 మినీ వాక్స్ మాయాజాలం :  భోజనం తర్వాత కూర్చోవడం సహజం. ముఖ్యంగా మీ భోజనం కార్బోహైడ్రేట్‌లతో సమృద్ధిగా ఉంటే మీరు తిన్న వెంటనే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇందుకు ఇన్సులిన్ అవసరం, అది చక్కెరను మీ కణాలలోకి పంపుతుంది. ఇప్పుడు, మీరు భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటుంటే, మీ కండరాలు పెద్దగా సహాయం చేయవు. అవి ఇన్ యాక్టీవ్గ ఉంటాయి, అంటే మీ శరీరం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మెల్లిమెల్లిగా ఈ స్థిరమైన ప్రక్రియ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. అంటే టైప్ 2 డయాబెటిస్‌కు కారణం. దీనికి తోడు కేలరీలు, చివరికి కొవ్వుగా మీ బొడ్డు చుట్టూ చేరి  గుండె జబ్బుల వరకు దారి తీయవచ్చు. 

2 నిమిషాల నడక ప్రభావం:  భోజనం తర్వాత కేవలం 2 నిమిషాలు నడవడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇంత తక్కువ సమయంలో అంత ప్రభావం చూపడం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది, కానీ సైన్స్ దానిని సమర్థిస్తుంది. 2022లో స్పోర్ట్స్ మెడిసిన్‌లో వచ్చిన ఒక అధ్యయనం చాల పరీక్షలను విశ్లేషించి, భోజనం తర్వాత 2 నుండి 5 నిమిషాల నడక చేసిన వ్యక్తులకు కూర్చున్న వారితో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు గొప్పగా తగ్గాయని తేల్చింది.  

ఎలా అలవాటు చేసుకోవాలి
 *టిఫిన్ తర్వాత డైరెక్ట్ వర్క్ మోడ్‌లోకి వెళ్లే బదులు మీ రోజును ప్లాన్ చేసుకునేటప్పుడు లేదా SMSలకు రిప్లయ్ ఇచ్చేటప్పుడు కాస్త అటూ ఇటూ తిరగండి.
* భోజనం తర్వాత మీ ఆఫీసు చుట్టూ ఒక రౌండ్ వేయండి లేదా కాస్త  బయటికి వాక్ చేయండి. 
* డిన్నర్ తర్వాత మీ ఫ్యామిలీతో  లేదా మీ కుక్కను చిన్న నడక కోసం తీసుకెళ్లండి. ఇది రెండిటికి మంచిది.
* మెట్ల మీద సాధారణ వేగంతో పైకి క్రిందికి నడవండి. దీని వల్ల జీర్ణక్రియకు  సహాయపడుతుంది. 

 మీరు తిన్న తర్వాత ఎంత సేపు నడిస్తే అంతగా రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీకు తక్కువ టైం ఉంటె 10-15 నిమిషాలు నడవడం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.  ఎక్కువగా వ్యాయామాలు, 30 రోజుల ఛాలెంజ్ వంటివి ఎక్కువగా ఈ ప్రపంచంలో ఉన్న చిన్న చిన్న కొన్ని అలవాట్ల శక్తిని తక్కువ అంచనా వేస్తాము. భోజనం తర్వాత కేవలం 2 నిమిషాలు నడవడం అనేది చాలా మందికి తెలియని గొప్ప ఆరోగ్య చిట్కా. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ మెల్లిమెల్లిగా ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఎక్కువ శక్తిని ఇస్తుంది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.