దేశంలో కొత్తగా 46 వేల 964 మందికి కరోనా

దేశంలో కొత్తగా 46 వేల 964 మందికి కరోనా

దేశంలో కొత్తగా 46 వేల 964 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 81 లక్షల 84 వేల 83 కు చేరాయి. కరోనాతో గత 24 గంటల్లో 470 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 22 వేల 111కు చేరింది. ప్రపంచదేశాలతో పోలిస్తే దేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో మరణాల రేటు 1.5 శాతానికన్నా తక్కువగా ఉందని తెలిపింది. 23 రాష్ట్రాల్లో మరణాల రేటు.. నేషనల్ యావరేజ్ కంటే తక్కువగా దని చెప్పింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, అండమాన్ దీవులు, కర్నాటక, లడక్, త్రిపుర, చత్తీస్ ఘర్, హర్యానాలో మరణాల రేటు ఒకశాతం కంటే ఎక్కువగా ఉంది.