గ్రామీణ రోడ్లకు మహర్దశ..ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు మూడు ప్యాకేజీల్లో 47 హ్యామ్ రోడ్లు మంజూరు

గ్రామీణ రోడ్లకు మహర్దశ..ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు మూడు ప్యాకేజీల్లో 47 హ్యామ్ రోడ్లు మంజూరు
  • రూ.871.74 కోట్లు కేటాయించిన సర్కార్ 
  • టెండర్లు పూర్తయ్యాక త్వరలోనే పనులు

కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గ్రామీణ రోడ్లకు ఇక మహర్దశ పట్టనుంది. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురై సింగిల్ లేన్‌‌‌‌‌‌‌‌ రోడ్లుగా ఉన్న రోడ్లు డబుల్‌‌‌‌‌‌‌‌ లేన్లుగా మారనున్నాయి. ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్ల విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో ఉమ్మడి జిల్లాలోని మూడు ప్యాకేజీల్లో 47 రోడ్లను మంజూరు చేసింది. 

564.41 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం కోసం రూ.871.74 కోట్లు కేటాయించింది. టెండర్లు పూర్తయ్యాక యుద్ధప్రాతిపదికన ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి.  

మంజూరైన రోడ్లు ఇవే.. 

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో జగిత్యాల 1 ప్యాకేజీలో 19(196.73కి.మీ, రూ.270.85 కోట్లు) రోడ్లు,  జగిత్యాల 2 ప్యాకేజీలో 8(138.65 కి.మీ, రూ.254 కోట్లు) రోడ్లు, కరీంనగర్ ప్యాకేజీలో 20(229 కి.మీ, రూ.346.87 కోట్లు) రోడ్లు మంజూరయ్యాయి. 

జగిత్యాల జిల్లాలో.. 

జగిత్యాల జిల్లాలో సూరంపేట, గోవిందారం, ఘంబీర్‌‌‌‌‌‌‌‌పూర్ మీదుగా కొడిమ్యాల నుంచి తాండ్రియాల్  ఎక్స్ రోడ్డు వరకు(8 కి.మీ, రూ.7.02 కోట్లు, 16.50 కి.మీ, రూ.14.49 కోట్లు), గొల్లపల్లి– -చెక్కాల రోడ్డు(7.40 కి.మీ, రూ.6.50 కోట్లు), ఉప్పుమడుగు–దావనపెల్లి రహదారి(15.45 కి.మీ, రూ.13.56 కోట్లు), వెంకటాపూర్–-మాదాపూర్ రోడ్డు(5.30 కి.మీ, రూ.4.65 కోట్లు), వర్షకొండ– ముల్లారాంపూర్ రోడ్డు(4.86 కి.మీ, రూ.4.27 కోట్లు), మోహన్‌‌‌‌‌‌‌‌రావుపేట– మాదాపూర్ (8.10 కి.మీ, రూ.7.11 కోట్లు), గోపాల్‌‌‌‌‌‌‌‌రావుపేట-–ధర్మపురి వయా సారంగౌర్, బీర్‌‌‌‌‌‌‌‌పూర్ రోడ్డు(21.40 కి.మీ, రూ.29.39), జగిత్యాల– పెద్దపల్లి (7 కి.మీ, రూ.8.11కోట్లు, 24.26 కి.మీ, రూ.28.09 కోట్లు), చిల్వకోడూర్– ఐతుపల్లి రోడ్డు(19.20 కి.మీ, రూ.22.23 కోట్లు), వెల్గటూర్– -కల్లెడ రోడ్డు(12 కి.మీ, రూ.13.90కోట్లు, 6.60 కి.మీ, రూ.7.64 కోట్లు), కోరుట్ల– మల్లాపూర్ రోడ్డు(15.80 కి.మీ, రూ.18.30 కోట్లు), కోరుట్ల–-రాయికల్(10 కి.మీ, రూ.11.58 కోట్లు, 4.10కి.మీ, రూ.4.75 కోట్లు), వేములవాడ– -దొంగలమర్రి(13 కి.మీ, రూ.15.05 కోట్లు), గుంజపడుగు– తిరుమలాపూర్(3.12 కి.మీ, రూ.8.57 కోట్లు), ఎన్ హెచ్ 16–బుగ్గారం రోడ్డు(2.40 కి.మీ, రూ.6.59 కోట్లు)ను డబుల్‌‌‌‌‌‌‌‌ రోడ్లుగా విస్తరించనున్నారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో..   

కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి నుంచి షానగర్ మీదుగా గంగాధర వరకు (14.70 కి.మీ, రూ.14.05 కోట్లు, 1.30కి.మీ, రూ.1.51 కోట్లు), కొత్తగట్టు– దుద్దెనపల్లి(10.90 కి.మీ, రూ.9.57 కోట్లు, 1 కి.మీ, రూ.0.88 కోట్లు), చెల్పూర్ నుంచి జూపాక మీదుగా కందుగుల వరకు(9.80కి.మీ, రూ.8.60 కోట్లు), వెల్ది నుంచి వేగురుపల్లి(4.20కి.మీ, రూ.3.69 కోట్లు), మానకొండూరు– పచ్చునూరు(15.83 కి.మీ, రూ.14.12 కోట్లు) విస్తరణకు నిధులు మంజూరయ్యాయి. 

పెద్దపల్లి జిల్లాలో.. 

పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి– అంతర్గాం రహదారి(బసంత్‌‌‌‌‌‌‌‌నగర్–- మొగల్‌‌‌‌‌‌‌‌పహాడ్  టీటీఎస్ జంక్షన్ మీదుగా  16.80 కి.మీ, రూ.19.46 కోట్లు), ఎ.పవర్ హౌస్ నుంచి పెద్దంపేట్ మీదుగా అంతర్గాం వరకు(8 కి.మీ, రూ.9.26 కోట్లు), గుంజపడుగు నుంచి ఉప్పట్లపోతారం మీదుగా విలోచవరం రోడ్డు(10 కి.మీ, రూ.8.78 కోట్లు), కూనారం– ముత్తారం(జాఫర్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌పేట్, ఎదులాపూర్ మీదుగా 18.16 కి.మీ, రూ.36.28 కోట్లు), సుల్తానాబాద్ నుంచి పెద్దాపూర్ వరకు(18.03 కి.మీ, రూ.44.35 కోట్లు) రోడ్ల విస్తరణకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మామిడిపల్లి–-నిజాంబాద్ రహదారి(4.70 కి.మీ, రూ.4.13 కోట్లు), బావుసాయిపేట–వెంకట్రావుపేట వరకు(3.30కి.మీ, రూ.2.90 కోట్లు), వట్టిమల్ల– -నిమ్మపల్లి(2.90 కి.మీ, రూ.2.55 కోట్లు), మాచారెడ్డి– ముస్తాబాద్–-సిద్దిపేట వరకు(38.60 కి.మీ, రూ.47.26 కోట్లు),  నామాపూర్ నుంచి గూడెం మీదుగా వెంకటాపూర్ వరకు(12.20 కి.మీ, రూ.14.13 కోట్లు), షాబాజ్‌‌‌‌‌‌‌‌పల్లి–- నెమికొండ(17.20 కి.మీ, రూ.19.92 కోట్లు), వేములవాడ బ్రాంచ్ రోడ్(4.30 కి.మీ, రూ.7.37 కోట్లు) విస్తరణకు నిధులు మంజూరయ్యాయి.