3 నెలల్లో 473 మంది మృత్యువాత

3 నెలల్లో 473 మంది మృత్యువాత
  • 2,275 ప్రమాదాలు, 2,201 మందికి గాయాలు 
  • బాధితుల్లో టూవీలర్స్​, పాదచారులే ఎక్కవ
  • నిర్లక్ష్యం, నిబంధనలు పాటించకపోవడమే కారణం:పోలీసులు

హైదరాబాద్, వెలుగు: నిర్లక్ష్యపు డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోం ది. నిత్యం చోటు చేసుకుం టున్న రోడ్డు ప్రమాదాల్లో నెలకు సగటున 30 మంది మృత్యు వాత పడుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న యాక్సిడెంట్లు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి.రోడ్డు సేఫ్టీపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వాటిని పాటించడంలో వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా సిటీ రోడ్లతోపాటు నేషనల్ హైవేలు, ఔటర్ రింగ్ రోడ్డులు రక్తసిక్తమవుతున్నాయి. ఇలా గతవారం ఉప్పల్ లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగితో పా టు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గతేడాదితో పోల్చి తే ఈ సంవత్సరం మొదటి మూడు నెల్లలో రోడ్డు యాక్సిడెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలోజరుగుతున్న ప్రమాదాలు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం 8,877 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1,684చనిపోగా 8,587 మంది గాయాలపాలయ్యారు.అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి మార్చి 31వరకు జరిగిన 2,275 రోడ్డు ప్రమాదాల్లో 473మృతి చెందారు. 2,201 మంది గాయపడ్డారు.ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోజరిగిన ప్రమాదాల్లో నే 220 మంది చనిపోయారు. దీంతో ప్రమాదాలకు గల కారణాలు,నివారణ చర్యలకు ట్రాఫిక్ పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో సిటీ రోడ్లపై జరిగిన 2,540 యాక్సిడెంట్లలో 974 టూవీలర్లు, 849 కార్లతో పాటు229 ఆటోలు,149 ఆర్టీసీ బస్సులు, 91 లారీలుప్రమాదాలకు గురయ్యాయి. వీటితో పాటు 83గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగాయి. ఒక్క ఆదివారం రోజునే 393 యా-క్సిడెంట్లు జరిగాయి. ఇందులోనూ ఎక్కువగారాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలో చోటుచేసుకున్నాయి. మొత్తం1,231 మంది టూ వీలర్స్ పై ప్రయాణం చేస్తున్న వాళ్లు బాధితులుగా ఉన్నారు. మరో 924 మంది పాదచారులు ప్రమాదాలకు గురయ్యారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రోడ్డు ప్రమాదాల్లో 50 శాతం ద్విచక్ర వాహనదారులు కాగా, 36 శాతం పాదచారులు బాధితులయ్యారు.