రాత్రి పూట హాయిగా నిద్ర పోవాలంటే ఇవి తినకండి

రాత్రి పూట హాయిగా నిద్ర పోవాలంటే ఇవి తినకండి

రాత్రి పూట ఎంత మంచిగా నిద్రపోతే.. మరుసటి రోజు అంత ఎనర్జీగా ఉంటారు. సాధారణంగా పగటి సమయం కంటే రాత్రి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదని నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. ప్రస్తుత రోజుల్లో వర్క్ వల్ల కాని టెన్షన్స్ వల్ల కాని చాలామంది రాత్రి పూట హాయిగా నిద్ర పోయేందుకు అవి ఇవి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి పూట నిద్రకు దూరం కాకుండా ఉండాలంటే పడుకునే ముందు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. 

కాఫీ

సాధారణంగా కాఫీ అలవాటు అందరికి ఉంటుంది. అయితే రాత్రి సమయంలో వెచ్చని కప్పు కాఫీని తాగితే నిద్ర ఎగిరిపోతుంది. కాఫీ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్.. మెదడులోని నిద్రను ప్రోత్సహించే గ్రాహకాలను నిరోధిస్తుంది. అందువల్ల మెదడు అప్రమత్తంగా ఉండి.. మగతను దూరం చేస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో కాఫీకి దూరంగా ఉంటే మంచిది. 

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ ఇది కూడా నిద్ర పై ప్రభావం చూపుతుంది. దీనిలో కూడా కెఫిన్ ఉంటుంది. రుచిగా ఉండే ఈ డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల ఎంత మత్తులో ఉన్నా సరే నిద్ర దూరం అవుతుంది. అర్థరాత్రి సమయంలో ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే డార్క్ చాక్లెట్ తినొచ్చు. 
 
గ్రీన్ చిల్లీ

గ్రీన్ చిల్లీ ఇందులో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను మార్చేస్తుంది. తాత్కాలికంగా వేడిగా అనిపించేలా చేస్తుంది. వేడి యొక్క విస్ఫోటనం ఒక గంట పాటు నిద్ర రాకుండా ఉండటానికి తగినంత శక్తిని ఇస్తుంది. అయితే మరీ ఎక్కువగా తింటే కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది.

 

బ్లాక్ టీ

మామూలుగా టీ అంటే ఇష్టపడని వారుండరు. కొందరు టైంతో పనిలేకుండా రెండు మూడు గంటలకు ఒకసారి టీని తాగుతూ ఉంటారు. పడుకునే ముందు ఒక్క కప్పు వెచ్చని బ్లాక్ టీ తాగితే.. రాత్రంతా మేల్కోని ఉండేలా చేస్తుంది. దీనిలో ఉండే కెఫిన్ మంచి సువాసనను వెదజల్లుతుంది.  అయితే.. పాలు కలపకుండా చేసే టీ తాగడం వల్ల మెదడు మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. దీని ప్రభావం మెదడు పై చురుగ్గా పనిచేస్తుంది. అందుకే చాలామంది రాత్రి పూట బ్లాక్ టీని దూరం పెడతారు. 

డెజర్ట్ కేక్ 

ఈ చిరుతిండి రాత్రి నిద్రను చెడగొడుతుంది. మామూలుగా దీన్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ స్వీట్ డెజర్ట్ ను అర్థరాత్రి సమయంలో చూస్తే తినకుండా ఉండలేరు. దీనిని తినేటప్పుడు కాఫీ ఫ్లేవర్ తో తయారు చేసిన ఈ స్నాక్ కెఫిన్ ఫీల్ పాటు క్రంచీగా అనుభూతిని కలిగిస్తుంది. కాని రాత్రి పూట దీన్ని తినడం వల్ల అస్సలు నిద్ర పట్టదు.