లక్షల మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య ఫ్రస్టేషన్.. గుర్తించడం ఎలా?

లక్షల మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య ఫ్రస్టేషన్.. గుర్తించడం ఎలా?

విక్రమ్‌‌..  యాడ్ ఏజెన్సీ ఫీల్డ్‌‌లో ఏడేళ్ల నుంచి ఉన్నాడు.  మూడేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నాడు.  నచ్చిన పని, మంచి శాలరీ, అందరితో కలిసిపోయే తత్వం..  అతని లైఫ్‌‌ హాయిగా సాగిపోతోంది. సరిగ్గా అప్పుడే కరోనా వచ్చిపడింది.  అతను పని చేసేచోట ‘2020’ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.  పని విషయంలో ఎప్పటిలాగే ఉన్నప్పటికీ..  వర్క్‌‌ప్లేస్‌‌ వ్యవహారాలు మాత్రం విక్రమ్‌‌ని మానసికంగా కుంగదీశాయి. అయితే ఇది విక్రమ్‌‌ లాంటి లక్షల మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి అని బోస్టన్‌‌ కన్సల్టింగ్‌‌ గ్రూపు(యూఎస్‌‌) అంటోంది.  ఈ గ్రూప్‌‌ మన దేశంతో పాటు డెబ్భై దేశాల్లో ఎంప్లాయిస్‌‌ను స్టడీ చేసి రిపోర్ట్‌‌ రిలీజ్ చేసింది.

పని ద్వారా తన స్కిల్స్‌‌ చూపించుకోవాలని ప్రతీ ఎంప్లాయి ఆరాటపడతాడు. పనిని ఆస్వాదిస్తూనే.. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటాడు.  కానీ, అందరి విషయంలో..  అన్నిసార్లు ఇది జరగకపోవచ్చు.  వర్క్‌‌ అనేది ఒక్కోసారి బుర్రని నెగెటివ్ ఆలోచనలతో నింపేస్తుంది.  సరిగా పని చేయలేకపోతున్నాననే ఆలోచన,   పని చేసినా గుర్తింపు దక్కట్లేదనే బాధ, కొలీగ్స్‌‌తో పడకపోవడం..  ఇవన్నీ ఒక్కరోజు కలిగితే ఫర్వాలేదు.  కానీ, సంవత్సరం పొడవునా ఇవే ఫీలింగ్‌‌లో ఉంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే.  ఇవి ఒక్కో మెట్టుగా ఎంప్లాయిని మానసికంగా కుంగదీసి ఫ్రస్టేషన్‌‌లోకి నెట్టేస్తాయి.  అయితే ఆ స్టెప్స్‌‌ను ముందుగానే గుర్తుపట్టొచ్చు అంటున్నారు సైకాలజిస్టులు.

వర్క్‌‌.. నో ఇంట్రెస్ట్‌‌

ఒక వ్యక్తి తాను చేసే పనిని ఇష్టపడకపోవడం..  మొదటి స్టెప్‌‌.  పనికి లేట్‌‌గా రావడం, రిమోట్‌‌ వర్క్‌‌(వర్క్‌‌ఫ్రమ్‌‌ హోం)లో లేట్‌‌గా లాగిన్‌‌ కావడం కూడా ఈ స్టెప్‌‌ కిందకే వస్తుంది.  ఇది పని చేసేవాళ్ల మెంటల్‌‌ హెల్త్‌‌ మీద నెగెటివ్‌‌ ప్రభావం పడుతోందని గుర్తు పట్టేందుకు ఒక మార్గం.  ముఖ్యంగా ఒకే ఆర్గనైజేషన్‌‌లో ఎక్కువ రోజులు పని చేసే ఎంప్లాయిస్‌‌లో ఈ ఆలోచన పెరుగుతోందని బోస్టన్‌‌ స్టడీ చెప్పింది.

ఆఫీస్‌‌ కంటే బయటే ఎక్కువగా!

వర్కింగ్‌‌ అవర్స్‌‌లో పనిని ఆస్వాదించలేక పోవడం.. రెండో స్టెప్‌‌.  వర్క్‌‌ ప్లేస్‌‌లో ఎంప్లాయిస్‌‌ భారంగా వర్క్‌‌ని ఫీలై చేస్తే..  పాజిటివ్ ఎమోషన్స్‌‌ ఉండవు. దీనివల్ల  డెయిలీ టాస్క్‌‌లు చేయడానికి ఇబ్బంది పడతారు.  ఒకానొక స్టేజ్‌‌కి వచ్చేసరికి పని చేయడానికే భయపడతారు.  పైగా కొలిగ్స్‌‌తోనూ హెల్దీ రిలేషన్‌‌ మెయింటెయిన్‌‌ చేయరు.  ఒక ఎంప్లాయి ఆఫీస్‌‌లో కంటే బయటే ఎక్కువసేపు ఉంటున్నాడంటే..  బయటే అతను హ్యాపీగా ఉంటున్నాడని అర్థం.  అయితే ఈ బిహేవియర్‌‌ని బట్టి వాళ్లు ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించాలి.

జబ్బులు

రోగాల బారిన పడడం.. మూడో స్టెప్‌‌. చాలా ఆర్గనైజేషన్స్‌‌లో 8 గంటల పని అనేది ఉంటుంది. కదలకుండా పని చేయడం వల్ల తలనొప్పి,  కండరాలకు సంబంధించిన జబ్బులు, గ్యాస్ట్రిక్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. పని ఒత్తిడి వల్ల కొందరికి  నిద్ర సరిగా పట్టదు.  దీనివల్ల క్రానిక్‌‌ డిసీజెస్‌‌(దీర్ఘకాలిక జబ్బులు) సోకి.. బాడీ–మైండ్‌‌పై నెగెటివ్ ప్రభావం చాలా కాలం కొనసాగుతుంది.

ఇరిటేషన్‌‌

కరోనా వేవ్‌‌ తర్వాత ఎంప్లాయిస్‌‌లో పని ఒత్తిడి పెరిగిందని చాలా సర్వేలు చెప్పాయి.  ఆ ఒత్తిడి వల్ల పని చేసేవాళ్ల మూడ్‌‌ కూడా మారిపోతోందట.  వర్క్‌‌తో ఎంప్లాయికి మంచి రిలేషన్‌‌షిప్‌‌ లేనప్పుడు.. హ్యాపీనెస్‌‌ ఉండదు.  ఫ్రస్ట్రేషన్‌‌ పెరిగి.. చిన్న తప్పు జరిగినా ఇరిటేట్‌‌ అవుతారు. ఆ కోపాన్ని కొలిగ్స్‌‌, ఇంట్లోవాళ్లపై చూపిస్తారు. ఈ నాలుగో స్టెప్‌‌ ప్రమాదకరం అనేది సైకాలజిస్టులు చెప్తున్నమాట.

యాంగ్జైటీ, డిప్రెషన్‌‌

వర్క్‌‌లోడ్‌‌, కొలిగ్స్‌‌తో కమ్యూనికేషన్‌‌ దెబ్బతినడం, చివరి స్టెప్​లో బాస్‌‌ల నుంచి ఒత్తిళ్లు.. పనిని సక్రమంగా చేయాలనే మూడ్‌‌ను మార్చేస్తాయి. పనిని ఒక భూతంలా చూపిస్తాయి. ఇదంతా యాంగ్జైటీకి దారితీస్తుంది. ఇక డిప్రెషన్‌‌ అనేది ఒంట్లో సత్తువని పోగొట్టి, బాధలోకి తీసుకెళ్తుంది. చివరి స్టెప్‌‌..  ముదిరితే మరింత ప్రమాదం. ఇలాంటి టైంలో మెంటల్ హెల్త్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ నుంచి గైడెన్స్‌‌ తీసుకోవడంతో పాటు అవసరమైతే వర్క్‌‌ నుంచి కొంత కాలం బ్రేక్‌‌ తీసుకోవడం బెటర్‌‌ అని సైకాలజిస్టులు సలహా ఇస్తున్నారు.