లోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి

లోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని బిల్లావర్ ప్రాంతంలోని ధను పరోల్ గ్రామంలో అర్థరాత్రి ఘోర  రోడ్డు  ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా..మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కథువా పోలీసులు..గాయపడిన వారిని బిల్లావర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ కౌగ్ నుండి దన్ను పెరోల్‌కు వెళ్తున్న ప్యాసింజర్ వెహికల్ సిలా వద్ద బోల్తా కొట్టిన తర్వాత లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో  నలుగురు స్పాట్ లోనే  మృతి చెందగా..మరో  వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు.  గాయపడిన 15 మందిని  జిల్లా ఆసుపత్రికి తరలించాం. మృతి చెందిన వారిని  బంటు, హన్స్ రాజ్, అజీత్ సింగ్, అమ్రూ, కాకు రామ్‌లుగా గుర్తించాం’’ అని వెల్లడించారు.