
యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక సందర్భంలో ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన కాల్పులపై ఇరుదేశాలు మరిచిపోయినా ట్రంప్ మరవకుండా గుర్తుచేస్తూనే ఉన్నారు. ఒకసారి యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పుకుంటూ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా మరోసారి ఆపరేషన్ సిందూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు సీజ్ ఫైర్ కు కారణం తానేనని చెప్పకున్న ట్రంప్.. ఈసారి కొంచెం లోతుగా వెళ్లారు. ఏదో వివాదాన్ని రేకెత్తించేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
శుక్రవారం (ఇండియాలో శనివారం జులై 19) ఆపరేషన్ సిందూర్ గురించి ట్రంప్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇండియా-పాక్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్లు కూలిపోయినట్లు ట్రంప్ చెప్పారు. రిపబ్లికన్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన డిన్నర్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కూలిన జెట్ విమానాలు ఎవరివనే విషయాన్ని చెప్పడానికి మాత్రం నిరాకరిచంచారు. యుద్ధవాతావరణంలో నాలుగు లేదా ఐదు విమానాలు గాల్లోనే పేలిపోయాయని.. కూలిపోయాయని ట్రంప్ చెప్పారు.
పాకిస్తాన్ కు పోరోక్ష మద్ధతు ఇస్తున్నారా..?
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో భారత పౌరులు 26 మంది చనిపోయారు. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ లో 9 టెర్రిరిస్ట్ క్యాంపులతో పాటు ఆర్మీ బేస్ క్యాంపులను, రన్ వేలను కూల్చేసింది ఇండియన్ ఆర్మీ. అదేవిధంగా కొన్ని ఫైటర్ జెట్లను కూడా ధ్వంసం చేసింది. ఈ వివరాలన్నింటినీ ఇండియా అధికారికంగా ప్రకటించింది.
ALSO READ : టెర్రరిస్టులనే నా కంటే బాగా చూసుకున్నరు: అసిమ్ మునీర్‌పై ఇమ్రాన్ ఖాన్ సీరియస్..!
మరోవైపు అంతర్జాతీయ సమాజం ముందు పరువు కోసం ఇండియాకు సంబంధించిన ఫైటర్ జెట్లను కూల్చేశామని పాక్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకుంది. కానీ ఆధారాలు మాత్రం చూపెట్టలేకపోయింది. పాక్ నిరాధార ఆరోపణలను చేస్తోందని ఇండియా తిప్పికొట్టింది. ఇండియాకు సంబంధించిన ఒక్క జెట్ కూడా కూలిపోలేదని తెలిపింది. అయితే ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు పాక్ మాటలకు బలాన్ని చేకూర్చేలా.. పరోక్షంగా మద్ధతు ఇచ్చేందుకే మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ను అమెరికా పిలిచి విందు ఇచ్చి పంపిన ట్రంప్.. భారత్ పై తన అక్కసు చెప్పకనే చెప్పారు. ఈసారి సద్దుమణిగిన అంశాన్ని మరోసారి లేవనెత్తి వివాదాన్ని రాజేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు విశ్లేషకులు.