గ్రూప్ 4కు 5 లక్షల దాకా అప్లికేషన్లు

గ్రూప్ 4కు 5 లక్షల దాకా అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 4 పోస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి 4,97,056 మంది అప్లై చేశారు. మొత్తం 8,039 పోస్టులకు డిసెంబర్ 30 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలుకాగా, ఈ నెల 30 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 

20 రోజుల్లోనే సుమారు 5 లక్షల అప్లికేషన్లు  రావడం గమనార్హం. మరో నాలుగు లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల16వ తేదీన 21,121 మంది, 17వ తేదీన 27,432 మంది, 18వ తేదీన 24,380 అభ్యర్థులు అప్లై చేశారని తెలిపారు.