5 States Election War: నవంబర్ 7న మిజోరం, ఛత్తీస్గఢ్లో మొదటి దశ పోలింగ్..

5 States Election War: నవంబర్ 7న మిజోరం, ఛత్తీస్గఢ్లో మొదటి దశ పోలింగ్..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్ పోరు రేపటినుంచి ప్రారంభం కానుంది. ముందుగా ఛత్తీస్ గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. నవంబర్ 7న ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు రెఫరెండంగా మారనున్నాయి.  

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ లో నవంబర్ 7న 20 స్థానాలకు తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకోసం 25 వేల మంది పోలింగ్ సిబ్బంది, 60 వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు అధికారులు. మొహ్లా, మన్ పూర్, అంతగఢ్, భానుప్రతాప్ పూర్, కంకేర్, కేష్కల్, కొండగావ్, నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొంటా వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వకు పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 17న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ నిర్వహించనున్నారు.