- ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్డీఈఓ రోహిణి
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్‌స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే – టీడబ్ల్యూజేఎఫ్) విజ్ఞప్తి చేసింది. యూనియన్అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం శుక్రవారం హైదరాబాద్ డీఈఓ రోహిణికి వినతి పత్రం అందజేశారు.
స్పందించిన డీఈఓ జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని మేనేజ్మెంట్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ సందర్భంగా డీఈఓకు హెచ్‌యూజే ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. రాయితీ ఉత్తర్వులను స్కూల్మేనేజ్మెంట్లు అమలు చేసేలా చూడాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్, మాధవరెడ్డి, ప్రతినిధులు ప్రేమ్, శ్రీధర్ తదితరులు ఉన్నారు.