ధాన్యం దొంగలు.. వడ్ల రాశి నుంచి 50 బస్తాలు చోరీ

ధాన్యం దొంగలు.. వడ్ల రాశి నుంచి 50 బస్తాలు చోరీ

యదాద్రి భవనగిరి జిల్లా : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. పంటను కోసి మార్కెట్లకు తరలించినా.. సమయానికి కొనకపోవడంతో రైతులు కల్లాలోనే పడిగాపులు కాస్తున్నారు. తమ వడ్లను ఎప్పుడు కొంటారా అని ఎదురుచూపులే వారికి మిగిలాయి. మార్కెట్లో వడ్లు కొనకపోవడం, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వీటన్నింటికి తోడు మార్కెట్లో వడ్లు పోయడానికి స్థలం కూడా దొరకడంలేదు.

తాజాగా.. రామన్న పేటకు చెందిన కొండే ముత్యాలు అనే మహిళా రైతు తన వడ్లను మార్కెట్ కు తీసుకెళ్లింది. అక్కడ వడ్లు పోయడానికి ఖాళీ లేకపోవడంతో పక్కనే ఉన్న ఓ వెంచర్ లో వడ్ల రాశి పోసింది. మహిళ కావడంతో ఆమె రాత్రి వేళ ఇంటికి వెళ్లింది.  మరుసటి రోజు ఉదయం వచ్చి చూసే సరికి రాశి నుంచి వడ్ల దొంగతనం జరిగింది. అక్కడ ఉన్న గుర్తుల ప్రకారం దొంగలు ఓ ట్రాలీ వాహనం వచ్చినట్లు గుర్తించారు. కష్టపడి పండించిన తన ధాన్యంలో సుమారు 50 బస్తాల చోరీ జరిగిందని రైతు ముత్యాలు కన్నీరుమున్నీరవుతోంది. తనను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటోంది.