ఆ ఒక్క రోజే 50 లక్షల మంది బస్సులెక్కిన్రు

ఆ ఒక్క రోజే  50 లక్షల మంది బస్సులెక్కిన్రు

హైదరాబాద్: మహిళలకు ఆర్టీసీ మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన కార్తీక సోమవారం (11వ తేదీ)రికార్డు స్థాయిలో రాకపోకలు సాగాయి. ఆ రోజు 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఆపరేషన్స్‌  ఈడీ మునిశేఖర్‌ వివరించారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య సోమవారానికి మరో 9 లక్షలు పెరిగిందన్నారు. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం.. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌తో పాటు స్పేర్‌ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.