మెహిదీపట్నం లో పటాకులు కాల్చుతూ 50 మందికి గాయాలు

మెహిదీపట్నం లో పటాకులు కాల్చుతూ 50 మందికి గాయాలు

మెహిదీపట్నం, వెలుగు: దీపావళి వేళ పటాకులు కాలుస్తూ ప్రమాదాల బారిన పడిన పలువురికి  సరోజినీ దేవి కంటి ఆస్పత్రి డాక్టర్లు ట్రీట్ మెంట్ చేశారు. పండుగ సందర్భంగా రెండు రోజులుగా హైదరాబాద్​లో ప్రజలు పటాకులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు కండ్లలో నిప్పురవ్వలు పడి గాయాలయ్యాయి. సుమారు 50 మందికి సరోజినీ దేవి కంటి ఆస్పత్రి డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించారు. నలుగురి కండ్లకు బలమైన గాయాలు కావడంతో ముగ్గురికి ఆపరేషన్ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగం తెలిపారు.

బాచుపల్లికి చెందిన కృష్ణమూర్తి (5), సిద్దిపేటకు చెందిన రిగ్వేద్ (11) తో పాటు కొంపల్లికి చెందిన జోసెఫ్ (25), బుద్వేల్ కు చెందిన సుమన్ కుమార్ (18)  కంటికి తీవ్ర గాయాలైనట్లు, వీరికి ఆపరేషన్ చేశామని, ఒకరిని అబ్జర్వేషన్ లో  ఉంచినట్లు చెప్పారు. పటాకుల కారణంగా కంటికి గాయాలైన వారు సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.