ఉబర్‌‌‌‌లో 500 మందికి ఐటీ కొలువులు

ఉబర్‌‌‌‌లో 500 మందికి ఐటీ కొలువులు

హైదరాబాద్‌‌, బెంగళూరులలోని టెక్ సెంటర్ల కోసమే

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలో మరింత మంది ఇంజినీర్లను ఉబర్ నియమించుకోనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 500 మంది టెకీలను హైర్ చేసుకుంటామని కంపెనీ ప్రకటించింది. కిందటేడాది 250 మంది టెకీలను నియమించుకున్న విషయం తెలిసిందే. దేశంలోని తమ టెక్‌‌ సెంటర్లలో ఉద్యోగులను పెంచుతున్నామని కంపెనీ పేర్కొంది. కేవలం ఇండియానే కాదు యూఎస్‌‌, కెనడా, లాటిన్ అమెరికా, ఆమ్‌‌స్టర్‌‌‌‌డామ్‌‌లలోని టెక్ సెంటర్లలో ఉద్యోగులను కంపెనీ పెంచుతోంది. ఇండియాలో ఉబర్‌‌‌‌కు హైదరాబాద్‌‌, బెంగళూరులలో టెక్ సెంటర్లు ఉన్నాయి. ఈ రెండు సెంటర్లలో 1,000 మంది టెకీలు పనిచేస్తున్నారు కూడా. తాజాగా మరో 500 మందిని ఈ రెండు సెంటర్ల కోసం నియమించుకోవాలని కంపెనీ చూస్తోంది. దేశంలోని ఇంజినీరింగ్ ట్యాలెంట్‌‌ను గుర్తించామని, ఇందుకు తమ హైరింగ్ ప్లాన్‌‌  నిదర్శనమని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో బెంగళూరులోని టెక్‌‌ సెంటర్‌‌‌‌లో కొత్త ఫ్లోర్‌‌‌‌ను కూడా ఉబర్ ప్రారంభించింది.