పీఎన్ బీలో 535 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

పీఎన్ బీలో 535 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ) 535 స్ పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీలు: 535

పోస్టు ఖాళీలు

మేనేజర్ (రిస్క్ ) 160

మేనేజర్ (క్రెడిట్ ) 200

మేనేజర్ (ట్రెజరీ) 30

మేనేజర్ (లా) 25

మేనేజర్ (ఆర్కిటెక్ట్ ) 02

మేనేజర్ (సివిల్ ) 08

మేనేజర్ (ఎకనామిక్స్ ) 10

మేనేజర్ (హెచ్ ఆర్ ) 10

సీనియర్ మేనేజర్ (రిస్క్ ) 40

సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ) 50

అర్హత: ఈ పోస్టులకు దేశ వ్యాప్తంగా అర్హతగల అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్ , సీఏ/ఐసీడబ్ల్ యూఏ/ ఎంబీఏ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం సెలెక్షన్ ప్రాసెస్ :ఆన్ లైన్ టెస్ట్ , ఇంటర్వ్యూ: రీజనింగ్ , ఇంగ్లిష్ లాంగ్వేజ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇలా నాలుగు అంశాల్లో పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానానికి వన్ ఫోర్త్ మార్క్ తగ్గిస్తారు . పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది. ఇంటర్వ్యూకు 35 మార్కులు ఉంటాయి. ఇందులో అర్హత సాధించాలంటే 40 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.

టాపిక్ మార్కులు రీజనింగ్ 50
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50
ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75
పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ .850,
ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు రూ . 175
దరఖాస్తులు: ఆన్ లైన్
చివరి తేది: 29 సెప్టెం బర్ 2020
వెబ్ సైట్ : www.pnbindia.in