దేశంలో 5,351కు చేరిన కరోనా కేసులు

దేశంలో 5,351కు చేరిన కరోనా కేసులు

160కు చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం 5,351కు చేరింది. మృతుల సంఖ్య 160కు పెరిగింది. 4,723 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు 468 మంది రికవర్ అయ్యారు. మహారాష్ట్రలో ఎక్కువగా 1,018 కేసులు నమోదవగా 64 మంది చనిపోయారు. తమిళనాడులో 690 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 17కు పెరిగింది. ఢిల్లీలో 576 పాజిటివ్ కేసుల్లో ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయారు.  రాజస్థాన్ లో 343, కేరళలో 336, యూపీలో 332, ఆంధ్రప్రదేశ్ లో 314 కేసు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ లో 290 కేసులు నమోదు కాగా, 21 మంది మరణించారు. గుజరాత్ లో 175 కేసులకు గాను 14 మంది చనిపోయారు.

గుజరాత్​లో 14 నెలల బాలుడి మృతి

కరోనాతో గుజరాత్​లోని జామ్​నగర్​ జిల్లా ప్రభుత్వ దవాఖానాలో 14 నెలల బాలుడు మరణించాడు. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో బాలుడికి కరోనా పాజిటివ్​గా తేలింది.

For More News..

60 లక్షల మంది నర్సుల కొరత

23 రోజుల బాబుకు ట్రీట్‌‌మెంట్ ఎట్ల?

ఈ నెల కొత్త కరెంట్ బిల్లు రాదు

వారికి కూడా 50 లక్షల కరోనా ఇన్సూరెన్స్