జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు..వీటిపై జీఎస్టీ తగ్గించారు 

జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు..వీటిపై జీఎస్టీ తగ్గించారు 

న్యూఢిల్లీ: 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిరువ్యాపారులు, రైల్వే ప్రయాణికులకు జీఎస్టీ తగ్గించారు. చదువుకునే విద్యార్థులకు కూడా జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే యోచన లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమాశమయ్యారు. డీజిల్ పెట్రోల్ రేట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే నిర్ణయం అని నిర్మలా సీతారామన్ అన్నారు. 

జీఎస్టీ కౌన్సిల్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు

పాలడబ్బాలపై జీఎస్టీ రేటు 

అన్ని పాల క్యాన్లు ఉక్కు, ఇనుము లేదా అల్యూమినియంతో తయారు చేసిన వాటిపై ఏకరీతి జీఎస్టీ రేటు 12 శాతం ప్రకటించారు. ఈ ప్రాడక్టుల పన్ను విధానాన్ని ప్రామాణికం చేస్తుందని అంటున్నారు. 

GST కిందకు పెట్రోల్, డీజిల్..?

పెట్రోల్, డీజిల్ రేట్లను GST కిందకు తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే రాష్ట్రాలు దీనికి ఒప్పుకోవాలి.ఇందులో భాగంగా నే 53 వ జీఎస్టీ కౌన్సిల్ లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం అయ్యారు నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. 

ఫ్లాట్ ఫాం టికెట్ పై జీఎస్టీ లేదు 

ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కౌన్సిల్ ఫ్లాట్ ఫాం టికెట్లపై జీఎస్టీ ని మినహాయింపు ఇచ్చింది. దీంతో రైల్వే సేవలు ప్రయాణికులకు మరింత సులభతరం కానున్నాయి. 

కార్టన్ బాక్సులకు జీఎస్టీ తగ్గింపు 

వివిధ రకాల కార్టన్ బాక్సులపై జీఎస్టీ రేటు 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. ప్యాకేజింట్ మెటీరియల్ ధరలు తగ్గించడం ద్వారా తయారీదారులు, వినియోగదారులకు లబ్ది పొందేలా ఈ మార్పు జీఎస్టీ తగ్గించామని నిర్మలా సీతారామన్ అన్నారు. 

విద్యార్థుల హాస్టల్ వసతిపై జీఎస్టీ మినహాయింపు 

ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ లో కాకుండా బయట హాస్టల్స్ లో ఉండి చదువుకునే విద్యార్థులకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చింది కేంద్రం. ప్రతి నెలా రూ.20వేల వరకు జీఎస్టీని మినహాయింపు ఇచ్చింది. 

రాష్ట్రాలకు షరతులతో రుణాలు 

సకాలంలో ట్యాక్స్ డివోల్యూషన్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, జీఎస్టీ కంపెన్షన్ సెటిల్ మెంట్స్ ద్వారా రాష్ట్రాలకు కేంద్రం చేస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. మూలధన పెట్టుబడులకోసం స్పెషల్ స్కీం ఉందని తెలిపారు. నిర్దిష్ట సంస్కరణలకు రాష్ట్రాలకు 50ఏళ్ల వడ్డీ లేని రునం ఇచ్చే పథకం ఇది.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మొత్తాన్ని విద్యా, వైద్యం, నీటి పారుదల, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలకు వినియోగించుకోవాలని సూచించింది.