కూలీలను తరలిస్తున్న ‘శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌’ గురించి మీకు తెలుసా?

కూలీలను తరలిస్తున్న  ‘శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌’ గురించి మీకు తెలుసా?
  • ఒక్కో కోచ్‌లో 54 మంది ప్యాసింజర్లు
  •  మధ్యలో ఎక్కడ నో స్టాప్స్‌

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రదేశాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్ర రైల్వే శాఖ ‘శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌’ లను నడుపుతోంది. కేవలం కూలీలను తరలించేందుకు వీటిని ఏర్పాటు చేసింది. బస్సులు ఏర్పాటు చేసేందుకు వీలు లేని ప్రాంతాల నుంచి రైళ్లు నడపాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన నేపథ్యంలో రైల్వే శాఖ స్పెషల్‌ ట్రైన్స్‌ వేసింది. రైళ్లలో సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా చర్యలు తీసుకుంటోంది.

శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌ గురించి

  • ఉత్తర్‌‌ప్రదేశ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, కేరళ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు కూలీలను తీసుకొచ్చేందుకు రైళ్లు కావాలని రిక్వెస్ట్‌ చేయడంతో రైల్వే శాఖ ‘శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో వీటిని స్టార్ట్‌ చేసింది.
  •  ఈ రైళ్లను ప్రతి రోజూ నడపుతున్నారు. జనాన్ని బట్టి రైళ్ల సంఖ్య పెంచుతాం అని అధికారులు చెప్పారు. శనివారం ఒక్కరోజే 10 రైళ్లు నడిచాయి.
  •  రైళ్లలో మొత్తం 24 కోచ్‌లు ఉండగా.. ఒక్కో కోచ్‌లో 72 మంది ప్రయాణించేందుకు వీలునప్పటికీ 54 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. అంటే ఒక్కో రైలులో 1200 మాత్రమే ప్రయాణిస్తారు.
  •  ప్యాసింజర్ల తాలూకు టికెట్‌ డబ్బులు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే కడతాయి.
  • 12 గంటల కంటే ఎక్కువ ప్రయాణించే వారికి మాత్రమే రైల్వేశాఖ ఫుడ్‌ ఇస్తోంది. స్టేషన్‌లో రైలు బయలుదేరే ముందే ఫుడ్‌ ఇవ్వాలని రైల్వే శాఖ రాష్ట్రాలకు ఆదేశించింది. అంతే కాకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కండిషన్‌ పెట్టింది.
  • మహారాష్ట్ర ముంబైలో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండటంతో రైళ్లు భివాండీ, వసాయి నుంచి వెళ్తున్నాయి.
  • అన్ని రాష్ట్రాల కంటే జార్ఖండ్‌ అత్యధికంగా 31 రైళ్లను పెట్టాలని కోరింది. దీని కోసం అడ్వాన్స్‌గానే రైల్వేకి డబ్బులు కట్టేసింది.
  • ఈ రైళ్లు స్టార్ట్‌ అయిన స్టేషన్‌ నుంచి నేరుగా గమ్య స్థానానికి వెళ్లిపోతుంది. మధ్యలో ఎక్కడా ఆగదు.
    సేఫ్టీ ప్రొటోకాల్‌లో ఏదైనా ఇబ్బంది కలిగితే రైళ్లను నిలిపేస్తామని రైల్వే శాఖ చెప్పింది.