ఆసిఫాబాద్ జిల్లాలో 54 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ సీజ్.. నలుగురిపై కేసు

ఆసిఫాబాద్ జిల్లాలో 54 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ సీజ్.. నలుగురిపై కేసు

దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 54 క్వింటాళ్ల పీడీఎస్​ రైస్ ను ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు  పట్టుకున్నారు. దహెగాం తహసీల్దార్​ మునావర్​ షరీఫ్​ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలోని వాసవి మోడ్రన్ రైస్ ​మిల్​లో పీడీఎస్ ​రైస్ ​రీసైక్లింగ్​చేస్తున్నట్టు ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులకు సమాచారం అందింది. నిఘా పెట్టి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నుంచి వాహనాన్ని ఫాలో చేస్తూ వచ్చి రైస్ ​మిల్ లో దాడి చేశారు.

వాహనంలో నుంచి పీడీఎస్ రైస్ అన్​లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. మిల్ ఆవరణలోని రేకుల షెడ్డులో కూడా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  మిల్లు ఓనర్ ​సూర సందీప్​తో పాటు డ్రైవర్​ మానెపల్లి అభిషేక్, బియ్యం సప్లై చేసిన కన్నెపల్లి మండలానికి చెందిన గుల్బం రాకేశ్, గుమస్తా విఘ్నేశ్​పై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్​ తెలిపారు.  రైస్​ మిల్​ను సీజ్​ చేసినట్టు చెప్పారు.