
- ప్రధాని మోదీకి ట్యాగ్
న్యూఢిల్లీ: జార్జియా టూర్‌కు వెళ్లిన 56 మంది భారతీయులను అక్కడి అధికారులు పశువుల్లా చూశారని.. తిండి లేదని, బాత్రూం పోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని బాధితుల్లో ఒకరైన ధ్రువీ పటేల్ అనే మహిళ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
వ్యాలీడ్ వీసా సహా అన్ని డాక్యుమెంట్లతో తాము అక్కడికి వెళ్తే.. క్రిమినల్స్‌ను ట్రీట్ చేసినట్లు ఆఫీసర్లు ప్రవర్తించారని ఆవేదన వెలిబుచ్చారు. తాము ఆర్మేనియాను దాటి జార్జియాలోకి ప్రవేశిస్తుంటే.. అధికారులు తనిఖీల పేరిట తమను చిత్ర వధకు గురిచేశారని ధ్రువీ పటేల్ పేర్కొన్నారు.
గడ్డకట్టే చలిలో గంటల తరబడి రోడ్డుపై కూర్చోబెట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రిమినల్స్‌ను తీసినట్లుగా తమను వీడియో తీసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ పోస్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ధ్రువీ పటేల్ ట్యాగ్ చేశారు. ఘటనపై భారత ప్రభుత్వం గట్టిగా బదులివ్వాలని ఆమె కోరారు.