తెలంగాణలో కొత్తగా 578 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 578 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 578 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. 731 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారని.. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తో ముగ్గురు మృతి చెందారని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 6,36,627కు పెరిగాయని.. 6,23,044 మంది చికిత్సతో కోలుకున్నారని తెలిపింది. ఇంకా 9,824 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మొత్తం మరణాలు 3,759కు చేరాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 90 వేలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.