OMG : మురికి కాలువలో 5 వేల పాల ప్యాకెట్లు..

OMG : మురికి కాలువలో 5 వేల పాల ప్యాకెట్లు..

చెన్నై సిటీ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది.. వరద తగ్గుతుంది.. ఈ సమయంలో కొన్ని కరోనా వాస్తవాలు బయటపడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం.. చెంగల్ పట్టు జిల్లాలోని తాంబరం దగ్గర మురికి కాలువల్లో 5 వేల పాల ప్యాకెట్లు కనిపించాయి. ఈ పాల ప్యాకెట్లు.. తమిళనాడు కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కు చెందినవి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ పాల సంస్థ.. పాల ప్యాకెట్లు మురికి కాలువల్లోకి ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇతర కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లు కూడా ఈ కాలువల్లో దొరకటంపై విచారణ చేస్తున్నారు అధికారులు.

వరద బాధితులకు సరఫరా చేయటానికి తీసుకొచ్చిన పాల ప్యాకెట్లు అని ప్రతిపక్షాలు అంటుంటే.. కాదు కాదు అని చెబుతోంది ప్రభుత్వం. భారీ వర్షాలు, వరదల కారణంగా రెండు, మూడు రోజులు కరెంట్ సరఫరా ఆగిపోయింది. ఈ క్రమంలోనే తాంబరం సమీపంలోని పాల బూత్ ఏజెంట్లు.. తమ పాలను విక్రయించలేక.. ఇలా కాలువల్లో పడేసినట్లు చెబుతున్నారు స్థానిక అధికారులు. 

కాలువల్లో దొరికిన 5 వేల పాల ప్యాకెట్లపై.. ఎక్సపయిరీ డేట్ డిసెంబర్ 4వ తేదీగా ఉంది.. ఆ రోజుల్లో కరెంట్ సరఫరా లేదని.. వరదల కారణంగా జనం ఎవరూ బయటకు రాలేదని.. ఈ క్రమంలోనే పాలను అమ్మలేకపోయారని.. డేట్ అయిపోయిన పాల ప్యాకెట్లను.. ఇలా రోడ్డు పక్కన మురికి కాలువల్లో పడేసి ఉంటారని తాంబరం అధికారులు చెబుతున్నారు. 

రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. వేల సంఖ్యలోని పాల ప్యాకెట్లు ఇలా మురికి కాలువల్లో కనిపించటంపై మాత్రం.. విమర్శలు వస్తున్నాయి. వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం అయ్యిందని.. అందుకే ఇలా పాలు పారబోయాల్సి వచ్చిందనేది వాస్తవం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ప్రతిపక్ష నేతలు. వరదల వల్ల జనం కనీసం పాలకు ఇబ్బంది పడుతుంటే.. వాటిని సరఫరా కూడా చేయలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందంటూ ఆరోపిస్తున్నారు నేతలు. అన్నీ ఆఫ్ లీటర్ ప్యాకెట్లు.. 5 వేల ప్యాకెట్లు అంటే.. రెండున్నర వేల లీటర్లు.. ఇలా మురికి కాలువలో కనిపించటం మాత్రం కలకలం రేపుతోంది.