దేశంలో ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నవంబర్ 10న ప్రారంభం కానుంది. ఇది చెన్నె, బెంగుళూరు, మైసూర్ మధ్య నడవనుంది. ఇటీవలే ప్రధాని మోడీ నాలుగో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు . ఢిల్లీ, -హిమాచల్ ప్రదేశ్ మధ్య ఇది నడుస్తుంది. గత నెలలో మూడో వందే భారత్ రైలును మోడీ ప్రారంభించారు. గాంధీ నగర్, ముంబయి మార్గంలో నడిచే ఆ రైలు ప్రమాదానికి గురికావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో వెంటనే దీనికి రిపేర్ చేసి ట్రాక్ మీదకు తీసుకొచ్చారు.
మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ- వారణాసి మధ్య , రెండో వందే భారత్ రైలును ఢిల్లీ- శ్రీ వైష్ణోదేవి మాతా, కట్రా మధ్య మోడీ ప్రారంభించారు. వందే భారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. ఈ రైలు కేవలం 140 సెకన్ల సమయంలో 160 కి.మీ. వేగం అందుకుంటుంది. దీపావళి నాటికి హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
