సాహిత్య ప్రయోజనం జాతీయ ప్రయోజనం కావాలి: బండారు దత్తాత్రేయ

సాహిత్య ప్రయోజనం జాతీయ ప్రయోజనం కావాలి: బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, వెలుగు: సాహిత్య ప్రయోజనం.. జాతీయ ప్రయోజనం కావాలని, అప్పుడే దానిలోనే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడా తెలుస్తుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. జన వికాస సేవా సమితి ఆధ్వర్యంలో పాండు రంగారావు రాసిన ఆరు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంమంగళవారం రవీంద్రభారతిలో జరిగింది. త్వరపడు, పరుగిడు, నిగ్గదీసి అడుగు, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, కరోనా నీ సిగదరగ, లెట్ లవ్ రూల్ అజ్ అనే ఆరు పుస్తకాలను దత్తాత్రేయ

 లోక్ సత్తా పార్టీ ఫౌండర్ జయప్రకాశ్ నారాయణ, ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ చింతా సాంబమూర్తి, జన వికాస సేవా సమితి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్,  ప్రధాన కార్యదర్శి నరోత్తం రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ.. దేశంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం స్థిరంగా ఉన్నాయని.. మార్పులు చేర్పులు అవసరం లేదని తెలిపారు.