తివారీ డ్యాంకు గండిపడి ఆరుగురు మృతి

తివారీ డ్యాంకు గండిపడి ఆరుగురు మృతి

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. దీంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలతో ఎగువ నుంచి నీరు రావడంతో రత్నగిరిలోని తివారీ ఆనకట్టకు గండిపడడంతో దిగువనున్న ఏడు గ్రామాలు నీట మునిగాయి. వరదల్లో కొట్టుకు పోయి ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా.. మరో 22 మంది గల్లంతయ్యారు. అందులో ఇద్దరి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. డ్యాంకు సమీపంలో ఉన్న 12 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్టీఆర్ఎఫ్ బలగాలు, పోలీసులు, వాలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.