
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, బోర్ వెల్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్ తో పాటు ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. చేవేళ్ల మండలం మల్కాపురం గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ప్రమాదంలో గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించారు .మృతులంతా హైదరాబాద్ కు చెందిన తాడ్ బండ్ వాసులుగా గుర్తించారు.