
సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం చాకిరాల దగ్గర నిన్న రాత్రి నాగార్జునసాగర్ ఎడమకాల్వలోకి దూసుకెళ్లిన కారును ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికితీసింది. కారు కాలువలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో 18 గంటల పాటు శ్రమించిన NDRF బృందం కాల్వ నుంచి కారును బయటకు తీశారు. అయితే వెలికితీసిన కారులో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి.
కోదాడ నియోజకవర్గంలోని చాకిరాల గ్రామంలో స్నేహితుడు మహేష్ గౌడ్ మ్యారేజ్ కి హాజరైన హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో కారు గుంతను తప్పించబోయి అదుపు తప్పి ప్రక్కనే ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడింది.
చనిపోయిన వారిని అబ్దుల్, రాజేష్, జిమ్ సన్, సంతోష్ కుమార్, నరేశ్, పవన్ కుమార్ గా గుర్తించారు.