మంచిర్యాల జిల్లాలో వడ్లు తిని 60 గొర్రెలు మృతి

మంచిర్యాల జిల్లాలో  వడ్లు తిని 60 గొర్రెలు మృతి

చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లాలో వడ్లు తిన్న గొర్రెలు చనిపోయాయి. చెన్నూరు మండలంలోని సుద్దాలకు చెందిన గానవోయిన పోచయ్య, తుర్కపల్లికి చెందిన బట్టి శ్రీశైలం, అక్కల పోచయ్యలకు చెందిన సుమారు 60 గొర్లు ఆదివారం వరి కల్లాల్లోని వడ్లను తిని మృతిచెందాయి. సమాచారం తెలియడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో జిల్లా జేడీ డాక్టర్ శంకర్, చెన్నూరు, భీమారం, కత్తెరసాల, ఆసనాద్ వెటర్నరి డాక్టర్లు, సిబ్బంది కలిసి అక్కడికి వెళ్లారు. చనిపోయిన గొర్రెలకు పోస్టుమార్టం చేశారు. వడ్లు అధికంగా తినడం వల్లే అరగక పొట్ట ఉబ్బి చనిపోయాయని తెలిపారు.  నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని  బాధితులు వేడుకున్నారు.