దాచుకున్న సొమ్మంతా పీఎం కేర్ ఫండ్​కు ఇచ్చేసిన వృద్ధురాలు

దాచుకున్న సొమ్మంతా పీఎం కేర్ ఫండ్​కు ఇచ్చేసిన వృద్ధురాలు

డెహ్రడూన్: కరోనాపై పోరులో కలిసి రావాలంటూ ప్రధాని ఇచ్చిన పిలుపుకు స్పందించిన డెహ్రాడూన్​ మహిళ స్పందించింది. తాను దాచుకున్న సొమ్మంతా పీఎం కేర్​ ఫండ్​కు ఇచ్చేసింది. ఛమోలీ జిల్లా గౌచర్​ ఏరియాకు చెందిన దేవకి భండారి(60) తను దాచుకున్న రూ.10 లక్షలను డొనేట్​ చేసింది. బుధవారం ఈ సొమ్ముకు సంబంధించిన చెక్కును అధికారులకు అందజేసింది. ఈ విషయం తెలిసి సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​ ఆమెను పురాణాల్లోని కర్ణుడు, బలి చక్రవర్తిలతో పోల్చారు. యావత్​ దేశానికి దేవకి ఆదర్శమని కొనియాడారు. నిస్వార్థ సేవకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారని, కరోనాపై పోరులో నైతిక స్థైర్యాన్నిస్తారని ప్రశంసించారు. మనందరికి దేవకి ఆదర్శంగా నిలిచారని అన్నారు.