బెంగళూరు ఐఐఎం స్టూడెంట్లకు 606 జాబ్స్​

బెంగళూరు ఐఐఎం స్టూడెంట్లకు 606 జాబ్స్​

న్యూఢిల్లీ: కన్సల్టింగ్,  ప్రొడక్ట్ మేనేజ్‌‌‌‌మెంట్ కంపెనీలు ఐఐఎం బెంగళూరు స్టూడెంట్లకు భారీగానే ఉద్యోగాలు ఇచ్చాయి.  2021–-23 బ్యాచ్​కు చెందిన​512 మంది  పీజీపీ, పీజీపీబీఏ స్టూడెంట్లకు 606 ఆఫర్స్​ అందించాయి. యాక్సెంచర్ నాయకత్వంలోని కన్సల్టింగ్ కంపెనీలు 221 ఆఫర్స్​ అందజేశాయి. యాక్సెంచర్​ 32 మందికి ఉద్యోగాలు ఇచ్చింది.  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్  26 ఆఫర్లతో తర్వాతి స్థానంలో ఉంది. బెయిన్ & కంపెనీ (23), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (18), మెకిన్సే & కంపెనీ (16), కెర్నీ (15), ఎర్నెస్ట్ & యంగ్ (13), ప్రైస్‌‌వాటర్‌‌ హౌస్‌‌ కూపర్స్ (11), అల్వారెజ్ & మార్సల్, ఆలివర్ వైమాన్, డెలాయిట్ మానిటర్, డెలాయిట్ వంటివి తర్వాత  స్థానాల్లో ఉన్నాయి. మెజారిటీ స్టూడెంట్లు స్ట్రాటజీ కన్సల్టింగ్ జాబ్స్​ను కోరుకున్నారు. మరికొందరు జనరల్ మేనేజ్‌‌మెంట్, ప్రొడక్షన్​ మేనేజ్​మెంట్​ వైపు ఆసక్తి చూపారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ,  ప్రొడక్ట్ మేనేజ్‌‌మెంట్ డొమైన్‌‌లో 85 ఆఫర్‌‌లు ఉన్నాయి. ఈ జాబ్స్​ ఇచ్చిన కంపెనీల్లో పేటీఎం (13), మైక్రోసాఫ్ట్​ (10), కోజోపోర్ట్​, జియో  ప్లాట్‌‌ఫారమ్, నాట్​వెస్ట్​ గ్రూప్​, సిస్కో  మొదలైనవి ఉన్నాయి. ఈ-–కామర్స్ స్పేస్​లో అమెజాన్ (14)  ఫ్లిప్‌‌కార్ట్ (8)లు 22 ఆఫర్స్​ ఇచ్చాయి. ఫైనాన్స్  డొమైన్‌‌లో  75 ఆఫర్‌‌లు ఉన్నాయి.

బ్యాంకుల్లో గోల్డ్‌‌మన్ శాక్స్​ 8 ఆఫర్‌‌లను అందించగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆరుగురికి అవకాశం ఇచ్చింది. ఇతర రిక్రూటర్లలో అవెండస్ క్యాపిటల్, సిటీ బ్యాంక్, ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి. కొన్ని గ్రూప్స్​ జనరల్ మేనేజ్‌‌మెంట్ స్థానాల కోసం 86  ఆఫర్‌‌లను ఇచ్చాయి. అదానీ,  వేదాంత  ఒక్కొక్కటి ఎనిమిది చొప్పున ఆఫర్స్​ ఇచ్చాయి. లోధా గ్రూప్ ఏడుగురికి అవకాశం ఇచ్చింది. సేల్స్,  మార్కెటింగ్  విభాగంలో 67 స్టూడెంట్లు ఆఫర్‌‌లను అందుకున్నారు. ఈ జాబ్స్​ఇచ్చిన వాటిలో  ఏషియన్  పెయింట్స్ (8),  శామ్‌‌సంగ్ ఇండియా (5), నవీ (4), నెస్లే (4), ఐటీసీ (3), మోండెలెజ్ ఇంటర్నేషనల్ (4) , ప్రోక్టర్ & గాంబుల్ (3) వంటి కంపెనీలు ఉన్నాయి. ఆపరేషనల్​ రోల్స్​ కోసం కోగోపోర్ట్ (5), ఓలా ఎలక్ట్రిక్​ (3), ఉబర్​ (3)  వంటి  కంపెనీలు 15 మందికి అవకాశాలు ఇచ్చాయి. ఎనలిటిక్స్​ రంగం మొత్తం 35 ఆఫర్లను ఇచ్చింది. అమెరికన్ ఎక్స్‌‌ప్రెస్ 16 ఆఫర్లతో ముందుంది. తర్వాత స్థానంలో ఈఎక్స్​ఎల్​ సర్వీసెస్ (9) ఉంది. ఐఎంబీ కెరీర్ డెవలప్‌‌మెంట్ సర్వీసెస్ చైర్‌‌పర్సన్ ప్రొఫెసర్ దేవలీనా దత్తా మాట్లాడుతూ మార్కెట్‌‌లో స్లోడౌన్​ ఉన్నప్పటికీ తమ స్టూడెంట్లు పెద్ద కంపెనీల నుంచి ఆఫర్‌‌లను అందుకున్నారని చెప్పారు.