ఎస్​బీఐలో 6100  అప్రెంటిస్‌లు

ఎస్​బీఐలో 6100  అప్రెంటిస్‌లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) అప్రెంటిస్​ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ (125), ఆంధ్రప్రదేశ్‌‌‌‌ (100)లలో  ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు. 

ప్రభుత్వాలు చేపడుతున్న పలు ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో బ్యాంకింగ్‍ అండ్‍ ఫైనాన్స్ రంగం విస్తరిస్తోంది. సాఫ్ట్ వేర్‍ తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో బ్యాంకింగ్‍ అండ్‍ ఫైనాన్స్ నిలుస్తోంది. ఇలాంటి బ్యాంకింగ్​ సెక్టార్‌లో రాణించడానికి ఎస్​బీఐ మంచి అవకాశం కల్పిస్తోంది.  6100 అప్రెంటిస్​ పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌‌‌‌ పాసై ఉండాలి.

వయస్సు: 2020 ఆగస్ట్ 31 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. గవర్నమెంట్​ రూల్స్​ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌‌‌లైన్ రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ద్వారా ఎంపిక చేస్తారు. క్వశ్చన్​ పేపర్​  ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లో ఉంటుంది. నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్స్​ తీసివేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ ఎగ్జామ్​ 100 మార్కులకు ఉంటుంది. జనరల్​, ఫైనాన్షియల్​ అవేర్​నెస్, జనరల్​ ఇంగ్లిష్​, క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​, రీజనింగ్​ అండ్​ కంప్యూటర్​ ఆప్టిట్యూడ్​ నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. 
స్టైఫండ్‌‌‌‌: నెలకు రూ.15,000
ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులు: ఆన్​లైన్​
అప్లికేషన్స్​ ప్రారంభం: 6 జులై 
చివరి తేదీ: 26 జులై
ఆన్‌‌‌‌లైన్ ఎగ్జామ్​: 2021 ఆగస్టు
వెబ్​సైట్​: www.sbi.co.in