ఒకే రోజు 61,408 కేసులు..57,468 మంది డిశ్చార్జ్

ఒకే రోజు 61,408 కేసులు..57,468 మంది డిశ్చార్జ్

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.ప్రతి రోజు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కొత్త కేేసులు పెరుగుతుండడం కలవరపెడుతున్నా..కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరట కల్గిస్తుంది.

భారత్ లో నిన్న ఒక్క రోజే  61,408 కేసులు నమోదవగా..57 468 మంది కరోనా నుంచి కోలుకున్నాారు. వీటితో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 31,06,349 కు చేరగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 23,38,036 కు చేరింది. మరో వైపు  836 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 57,542 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.