తెలంగాణ‌లో మ‌రో 62 క‌రోనా కేసులు.. 48కి చేరిన మ‌ర‌ణాలు

తెలంగాణ‌లో మ‌రో 62 క‌రోనా కేసులు.. 48కి చేరిన మ‌ర‌ణాలు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 62 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు 1761కి చేరిన‌ట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. శుక్ర‌వారం సాయంత్రం 8 గంట‌ల‌కు క‌రోనాపై బులిటెన్ విడుద‌ల చేసింది. ఇవాళ జీహెచ్ఎంసీ ప‌రిధిలో 42 కేసులు, రంగారెడ్డి జిల్లాలో ఒక‌ క‌రోనా కేసు న‌మోదైన‌ట్లు తెలిపింది. అలాగే కొత్త‌గా 19 మంది వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు చెప్పింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో క‌రోనా బారిన‌ప‌డిన మొత్తం వ‌ల‌స కార్మికుల సంఖ్య 119కి చేరింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇవాళ క‌రోనా నుంచి ఏడుగురు కోలుకోవ‌డంతో, ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1043కు చేరినట్లు తెలిపింది. శుక్ర‌వారం ఒక్క రోజే ముగ్గురు క‌రోనాతో మ‌ర‌ణించ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 48 మంది క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యార‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం 670 మంది క‌రోనాతో చికిత్స పొందుతున్నార‌ని చెప్పింది.