మే నాటికే దేశంలో 64 లక్షల మందికి  కరోనా

మే నాటికే దేశంలో 64 లక్షల మందికి  కరోనా

మే నాటికే  దేశంలో 64 లక్షల  మందికి  కరోనా సోకినట్లు అంచనా వేసింది  నేషనల్  సెరో సర్వే. అప్పటికీ  దేశంలో ఇంకా లాక్ డౌన్  కుడా ఎత్తేయలేదు. నేషనల్  సెరో సర్వే వివరాలను ఆలస్యంగా  వెల్లడించింది ICMR.  బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా వ్యక్తికి  పాజిటివ్ వచ్చిందో   లేదో నిర్ధారించారు . వ్యక్తి నుంచి తీసుకున్న  బ్లడ్ శాంపిల్స్ లో  యాంటీబాడీస్ డెవలప్  అయితే అతనికి  పాజిటివ్ వచ్చినట్లు  గుర్తిస్తారు. ఆ వ్యక్తికి యాంటీబాడీస్  డెవలప్ అయ్యాయంటే..  అతనికి రెండు వారాల కిందటే  వైరస్ సోకి  ఉన్నట్లు అర్థం.  21 రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది.  21 జిల్లాలోని  700 గ్రామాల్లో  సర్వే చేపట్టారు. సర్వే కోసం   30వేల 283  ఇళ్లు తిరగ్గా… ఇందులో  28వేల మంది వారి  బ్లడ్ శాంపిల్స్  ఇచ్చేందుకు అంగీకరించినట్లు  ICMR తెలిపింది. ఈ సర్వేకు దాదాపు  నెల రోజుల సమయం పట్టిందని తెలిపింది.

కేసీఆర్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తా

NSD ఛైర్మన్ గా ప్రముఖ నటుడు పరేష్ రావల్

నాకు నష్టపరిహారం ఇప్పించండి: కంగనా రనౌత్

కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 96,551 కేసులు..1209 మరణాలు