
కర్ణాటక ధర్వాడ్‌లోని మెడికల్ కాలేజీకి చెందిన 66 మంది విద్యార్థులకు కరోనా సోకింది. SDM మెడికల్ సైన్స్ కాలేజీకి చెందిన వీరంతా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఇటీవల కాలేజీలో జరిగిన ఒక ఈవెంట్‌కి విద్యార్థులంతా హాజరయ్యారని.. ఆ తర్వాత కొంతమందిలో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కాలేజీలోని 400 మంది విద్యార్థులకుగాను 300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ధర్వాడ్ జిల్లా వైద్య అధికారి, డిప్యూటీ కమిషనర్ నితేష్ పటేల్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు హాస్టల్స్‌ను మూసివేశామన్నారు. మిగిలిన విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తరగతులను కూడా నిషేధించినట్లు చెప్పారు. ఆ 66 మంది విద్యార్థులను క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.