నిన్న ఒక్కరోజే దేశంలో 67 వేల కరోనా కేసులు నమోదు

నిన్న ఒక్కరోజే దేశంలో 67 వేల కరోనా కేసులు నమోదు

‌దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రికార్డుస్థాయిలో 67 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య దాదాపు 24 ల‌క్ష‌ల‌కు చేరువైంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 66,999 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యయని కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,638కి చేరింది. ఇందులో 16,95,982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. మ‌రో 6,53,622 కేసులు యాక్టివ్‌గా ఉన్న‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల బుధవారం 942 మంది మ‌ర‌ణించారు. దాంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మరణించిన వారిసంఖ్య 47,033కు చేరింది. దేశంలో ప్ర‌తిరోజు పాజిటివ్ కేసులు భారీగా న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ, కోలుకుంటున్న ‌వారిసంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 70.76 శాతానికి చేరుకోగా.. మ‌ర‌ణా‌ల రేటు 1.98 శాతంగా ఉంది.

నిన్నటివరకు దేశంలో 2,68,45,688 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజే 8,30,391 శాంపిళ్లను టెస్ట్ చేసినట్లు తెలిపింది.

For More News..

కొత్త ట్యాక్స్ స్కీం ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు

తెలంగాణలో మరో 1931 కరోనా కేసులు