జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’

న్యూఢిల్లీ: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌‌లో తెలుగు సినిమాకు పంట పండింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ ఎంపికైంది. బెస్ట్ ఎడిటింగ్ ఫిల్మ్‌‌గానూ జెర్సీ సెలెక్ట్ అయ్యింది. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో జెర్సీకి ఎడిటర్‌‌గా వ్యవహరించిన నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి నిలిచింది. ఇదే సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌‌గా రాజుసుందరం అవార్డును దక్కించుకున్నారు. ఈ మూవీని నిర్మించిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఉత్తమ నిర్మాణ సంస్థ పురస్కారానికి ఎంపికైంది. ఇక ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌‌గా జల్లికట్టు (మలయాళం) పురస్కారాన్ని దక్కించుకుంది. ఉత్తమ నటి పురస్కారాన్ని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (మణికర్ణిక, పంగా) దక్కించుకోగా.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు మనోజ్ భాజ్‌పాయ్ (భోస్లే), ధనుష్ (తమిళం) సంయుక్తంగా ఎంపికయ్యారు.