
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పెరిగిన నేరాల సంఖ్య పెరిగిందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే 6.86 శాతం నేరాలు పెరిగాయన్నారు. గతేడాది 27 వేల 664 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 29,166 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
ఇక 25 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని, చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గాయని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. హత్యలు, కిడ్నాప్‌లు పెరిగాయన్నారు. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.
మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మందిని అరెస్టు చేశామన్నారు. గేమింగ్ యాక్ట్‌పై 188 కేసులు నమోదు కాగా 972 మంది అరెస్టు చేశామని వెల్లడించారు.