29 లక్షలు దాటిన కేసులు..54 వేలు దాటిన మరణాలు

29 లక్షలు దాటిన కేసులు..54 వేలు దాటిన మరణాలు

దేశంలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు విపరతీంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 68, 898 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తం 29,05,824 కి చేరింది. మరో 983 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 54,849 కి చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 21,58,947 మంది కోలుకున్నారు. ఇంకా 6,92,028 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే దేశంలో 8,05,985 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఆగస్టు 20 వరకు టెస్టుల సంఖ్య మొత్తం 3,34,67,237 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.