సీపీగెట్ ఫైనల్ ఫేజ్లో 6,943 మందికి సీట్లు

సీపీగెట్ ఫైనల్ ఫేజ్లో 6,943 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కామన్  పోస్ట్ గ్రాడ్యుయేట్  ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫైనల్  ఫేజ్  సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఫేజ్ లో 13,562 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా 6,943 మందికి సీట్లు దక్కాయని సీపీగెట్ కన్వీనర్  పాండురంగారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

సీట్లు పొందిన అభ్యర్థులు కోర్సు ఫీజును ఆన్ లైaన్​లో చెల్లించి ఈ నెల 11 వరకూ కాలేజీలో రిపోర్టు చేయాలని సూచించారు. కాలేజీ ప్రిన్సిపల్స్  విద్యార్థుల నుంచి ఒరిజినల్  టీసీ మాత్రమే తీసుకోవాలని, మిగిలినవి కేవలం వెరిఫై చేయాలన్నారు. మరిన్ని వివరాలకు https://cpget.tgche.ac.in లేదా www.ouadmissions.com వెబ్‌బ‌ సైట్లను  చూడాలని తెలిపారు.