భారీ వర్షాల కారణంగా .. 7 భవనాలు కూలిపోయాయి

 భారీ వర్షాల కారణంగా ..  7 భవనాలు కూలిపోయాయి

హిమాచల్‌ ప్రదేశ్ లోని కులులో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 7 భవనాలు కూలిపోయాయి. ఆ ప్రాంతంలోని మరో భవనం ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించబడింది. భారీ వర్షాల కారణంగా భవనాలుకు పగుళ్లు ఏర్పడడంతో మూడు రోజుల క్రితమే వాటిని ఖాళీ చేశామని అని నరేష్ వర్మ అనే అధికారి తెలిపారు.

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మరో 13 మంది మృతి చెందారు.  భారత వాతావరణ శాఖ (IMD) రెండు రాష్ట్రాల్లో రెడ్ , ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన మేఘాలు మరియు కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్‌లో 12 మంది మరణించగా, ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో బుధవారం మరొకరు మరణించారు. 400కు పైగా రోడ్లు మూసుకుపోయాయని, పలు ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.  

రాబోయే 24 గంటలలో సిమ్లాతో సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.  భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ నెలలో కురిసిన వర్షాలకు120 మంది మరణించారు.  రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 238 మంది మరణించారు. 40 మంది తప్పిపోయారు.