బేటీ బచావో స్కీం కింద రాష్ట్రానికి 7 కోట్లు

బేటీ బచావో స్కీం కింద రాష్ట్రానికి 7 కోట్లు
  • రాజ్యసభలో కేంద్రం వెల్లడి 

న్యూఢిల్లీ, వెలుగు: బేటీ బచావో – బేటీ పఢావో స్కీం కింద గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ. 7. 86 కోట్లు అందుబాటులో ఉంచగా, రూ. 3. 81 కోట్లను వినియోగించుకుందని కేంద్రం తెలిపింది. ఎంపీ బండ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. ఇంటెలిజెన్స్, 5జీ  టెక్నాలజీలో సహకారం అందించుకునేందుకు జపాన్, భారత్ మధ్య ఒప్పందం కుదిరిందని ఎంపీ బడుగు లింగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సంజయ్ థోత్రి సమాధానం ఇచ్చారు.

హెచ్​సీయూకి పీవీ పేరు పెట్టాలి: బండ ప్రకాశ్

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ సెంట్రల్ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీ(హెచ్ సీ యూ)కి మాజీ ప్రధాని పీవీ న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రసింహారావు పేరు పెట్టాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎంపీ బండ ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఆయనకు భార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్న ఇవ్వాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, ఢిల్లీలోని ఓ హైవేకు ఆయన పేరు పెట్టాలని కోరారు. గురువారం రాజ్యసభలో ప్రెసిడెంట్ స్పీచ్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్చ సంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంగా ఆయన మాట్లాడారు. బీసీలకు ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు, చట్ట సభల్లో ఓబీసీ, విమెన్ రిజర్వేషన్లకు ఆయన డిమాండ్ చేశారు.

For More News..

ఈ నెలలో రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ వారం పొడిగింపు

మేయర్ పోస్టుకు పోటీచేయాలని మజ్లిస్‌కు టీఆర్ఎస్ ఆఫర్

మూడురోజుల్లో గుంతలు పూడ్చకుంటే జీతాల్లో కోత